Category

National

TUWJ launches 'Postcard Campaign' in Delhi demanding journalists' welfare

National

By Shekar

14 Oct 2026

TUWJ launches 'Postcard Campaign' in Delhi demanding journalists' welfare

New Delhi: Expressing concern over the continued neglect of journalists who serve as the fourth pillar of democracy, Indian Journalists Union (IJU) National Executive Member and TUWJ Delhi in-charge Avvari Bhaskar demanded the immediate resolution of their pending health and welfare issues. To press for these demands, the Telangana Union of Working Journalists (TUWJ H-143) launched a 'Postcard Campaign' in the national capital.

Speaking as the chief guest at the TUWJ Delhi Unit committee meeting held at Gurajada Hall in Telangana Bhavan on Wednesday, Bhaskar called upon all journalists to take their grievances directly to the Chief Minister through postcards. He highlighted that journalists operating out of New Delhi, far from their home state, work tirelessly round the clock braving extreme heat, rain, and severe pollution, making comprehensive health security an absolute necessity.

He demanded that the state government immediately issue health cards and allocate housing plots to all eligible journalists to ensure security for their families. Furthermore, he urged the government to expedite the implementation of pension facilities, honorariums, and the resolution of all other pending welfare issues. Bhaskar expressed deep anguish that despite bringing these issues to the government's attention for years, a complete solution remains elusive. He noted that the primary objective of the postcard campaign is to build pressure on the government.

He stated that this initiative is being carried out in response to the TUWJ State Committee's call for a united agitation to resolve journalists' issues statewide. Bhaskar warned that if the government fails to respond positively to their rightful demands, the union will intensify its protests in a phased manner across the state.

The event saw the participation of TUWJ (H-143) Delhi President Nagilla Venkat, General Secretary Meka Gopikrishna, Treasurer Konnoju Raju, State Committee members Rajashekhar Reddy and Ashok Reddy, Advisors Mukkamala Satish, Secretary Nagaraju, Srikar, and others.

సీఈసీ రాజీనామా చేయాల్సిందే.. ‘ఇండి’ కూటమి

National

By Shekar

07 Oct 2026

సీఈసీ రాజీనామా చేయాల్సిందే.. ‘ఇండి’ కూటమి

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష ‘ఇండి’ కూటమి దేశ రాజధానిలో చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, సీఈసీ వైదొలగాలనే ఏకైక డిమాండ్‌తో విపక్ష ఎంపీలు జంతర్‌మంతర్‌ ముట్టడికి యత్నించారు. అయితే, అనుమతి లేదంటూ వారిని అశోకా రోడ్డు వద్దే దిల్లీ పోలీసులు బలవంతంగా నిలువరించి అదుపులోకి తీసుకున్నారు.

రాజీనామా చేసేవరకూ పోరాటం ఆగదు: రాహుల్‌ గాంధీ

జంతర్‌మంతర్‌ బయలుదేరడానికి ముందు దిల్లీలోని సాగర్ రత్న హోటల్ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ సీఈసీపై నేరుగా విరుచుకుపడ్డారు:

‘‘జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని, ఆయన రాజీనామా సమర్పించేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ దేశంలో అత్యంత పవిత్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకే మేం పోరాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మాపై ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయం. నాపై వంద ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా సంతోషమే.. ఆ కేసులను గౌరవప్రదమైన పతకాలుగా భావిస్తాం. ఎన్నికల సంఘం పాల్పడుతున్న అరాచకాలను దేశవ్యాప్తంగా ప్రతి వీధికీ తీసుకెళ్తాం.’’ అని రాహుల్ అన్నారు.

అశోకా రోడ్డుపై ఉద్రిక్తత.. ఎంపీల నిర్బంధం

హోటల్‌ నుంచి మూడు ప్రత్యేక బస్సుల్లో విపక్ష ఎంపీలు జంతర్‌మంతర్‌ వైపు బయలుదేరగా, అశోకా రోడ్డు వద్ద భారీగా మోహరించిన పోలీసులు, కేంద్ర బలగాలు బారికేడ్లతో ఆ కాన్వాయ్‌ను అడ్డగించాయి. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకు ఉందంటూ ఎంపీలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

పోలీసులు నాపై దాడి చేశారు: ప్రియాంక గాంధీ ఆగ్రహం

పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా నడిరోడ్డుపై పడుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.‘‘ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని కోరుతున్న పార్లమెంట్ సభ్యుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? పోలీసులు నన్ను కిందపడేసి ఈడ్చుకెళ్లారు. నా చేతులు, శరీరమంతా రక్కేశారు. మహిళా ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. మేం ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు’’ అని ప్రియాంక ధ్వజమెత్తారు. సీఈసీ రాజీనామా కోరుతూ సాగిన ఈ ఆందోళనలతో దిల్లీ నడిబొడ్డున భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎన్నికల సంఘం పారదర్శకతను కోల్పోయిందని, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని విపక్ష కూటమి నేతలు స్పష్టం చేశారు

శివ కేశవులు వేరనటం వెర్రితనమే…

National

By Shekar

01 Oct 2026

శివ కేశవులు వేరనటం వెర్రితనమే…

సీఎం వాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిప్పులు

దిల్లీ: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 ఉప హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రజల దృష్టి మళ్లించేందుకే దేవుళ్ల మధ్య చిచ్చుపెడుతూ చౌకబారు రాజకీయాలకు ఒడిగడుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాముడు, శివుడిని వేరుచేస్తూ సనాతన ధర్మాన్ని కించపరిచేలా సీఎం చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను యావత్ సమాజం ఛీత్కరించుకుంటోందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్‌ హిందూ సమాజాన్ని అవహేళన చేసి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, ఇప్పుడు అధిష్ఠానం మెప్పు కోసం రేవంత్‌రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తూ భంగపడక తప్పదని హెచ్చరించారు.

ఓడిన ప్రతిసారీ ఈవీఎంలపై నెపం నెట్టడం కాంగ్రెస్‌కు అలవాటైందని విమర్శించిన కిషన్‌రెడ్డి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓట్ చోరీ’ జరిగిందని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. బోగస్ ఓట్ల ఏరివేత కోసమే అధికారులు సమగ్ర ప్రక్రియ చేపడుతుంటే కాంగ్రెస్‌ ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల ఎంపీ స్థానాలను 129 నుంచి 195కు పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గాల పునర్విభజనను దురుద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆరోపించారు. స్థానిక సింగరేణి బొగ్గు వినియోగానికి అనుగుణంగా యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ బాయిలర్లను ఎందుకు నిర్మించలేదో గత బీఆర్‌ఎస్‌ పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోబోదని, కేటీఆర్‌ పగటికలలు మానుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఖైరతాబాద్‌ ఉపఎన్నిక వస్తే బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, అక్టోబర్‌ 3, 4 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని, అక్టోబర్‌ 2 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ‘స్వచ్ఛతా సంకల్ప్‌’లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

అల్యూమినియం హబ్‌గా తూర్పు భారతం..కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

National

By Shekar

28 Sept 2026

అల్యూమినియం హబ్‌గా తూర్పు భారతం..కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

ఒడిశా గనులు, బెంగాల్‌ వాణిజ్యంతో విస్తృత అవకాశాలు

కోల్‌కతా: తూర్పు భారత ప్రాంతాన్ని దేశ పారిశ్రామికాభివృద్ధికి కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన ‘అల్యూమినియం రోడ్‌షో’లో పారిశ్రామికవేత్తలు, వ్యాపార రంగ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒడిశాలోని ఖనిజ సంపదను, పశ్చిమబెంగాల్‌ పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ సామర్థ్యంతో అనుసంధానిస్తే ఈ ప్రాంతం ప్రపంచస్థాయి అల్యూమినియం తయారీ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రక్షణ, రైల్వే, పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ రంగాల్లో అల్యూమినియం ప్రాధాన్యం పెరుగుతోందని, 'నెట్‌ జీరో 2070' సాధనలోనూ దీని పాత్ర కీలకమన్నారు. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా అధిక విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. 'అల్యూమినియం విజన్‌ 2047' ద్వారా దేశీయ ఉత్పత్తిని దాదాపు ఆరు రెట్లు పెంచడంతో పాటు, ప్రపంచ మార్కెట్లో భారత వాటాను 3.8 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

దేశంలో బొగ్గు కొరత లేదు

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో బొగ్గు కొరత లేదని స్పష్టం చేశారు. వర్షాకాలం ప్రభావం తగ్గుముఖం పట్టడంతో గనుల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకుందని, విద్యుత్ కేంద్రాలు సహా పరిశ్రమలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.

డా. సుప్రియా రత్న కుమార్‌కు అంతర్జాతీయ గుర్తింపు

National

By Shekar

28 Sept 2026

డా. సుప్రియా రత్న కుమార్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ఐపీసీ లెఫ్టినెంట్‌ జనరల్‌గా తొలి భారతీయ మహిళ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత మహిళా శక్తి మరోసారి సత్తా చాటింది. ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ పోలీస్ కమిషన్ – గ్లోబల్ కమాండ్ ఇంటర్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (IPC GC IGO) ఆమెను ‘సౌత్ ఏషియా కమాండర్’గా నియమించింది. సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పీస్‌కీపింగ్ ఆపరేషన్స్ పరిధిలో పారామిలిటరీ హోదా కలిగిన 'లెఫ్టినెంట్ జనరల్' బాధ్యతలను ఆమెకు అప్పగించింది. ఈ హోదాను దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు.

ప్రపంచ శాంతి, అంతర్జాతీయ చట్టాల అమలు, ప్రజా భద్రత, మానవతా దృక్పథంతో కూడిన సామాజిక సేవల విస్తరణే లక్ష్యంగా ఐపీసీ జీసీ ఐజీవో పనిచేస్తోంది. సంస్థ సుప్రీమ్ కమాండింగ్ జనరల్ రాబర్ట్ ఎస్. బియాజోన్ నేతృత్వంలోని గ్లోబల్ సుప్రీమ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డా. సుప్రియా నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి స్థాపన, విపత్తు సహాయక చర్యలు, సామాజిక సాధికారత తదితర కార్యక్రమాలకు ఆమె నాయకత్వం వహించనున్నారు.

ఫిలిప్పీన్స్‌లో ఉన్నత స్థాయి భేటీలు

ఈ నియామకం అనంతరం సెప్టెంబరు 19 నుంచి 25 వరకు డాక్టర్ సుప్రియా ఫిలిప్పీన్స్‌లో అధికారిక పర్యటన చేపట్టారు. అక్కడ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుల్లో సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గ్లైజా జేడ్ సి. పెనెడా, గ్లోబల్ ప్రొటెక్షన్ విభాగ డైరెక్టర్ బ్రయాన్ అల్ఫోన్సోతో పాటు ఫిలిప్పీన్ కమాండ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అలాగే దక్షిణ కొరియా, బంగ్లాదేశ్, అమెరికా తదితర దేశాల ఐపీసీ కమాండర్లతో ప్రత్యేకంగా భేటీ అయి, దక్షిణాసియాలో చేపట్టాల్సిన మానవతా సేవా ప్రాజెక్టులు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు. అంతర్జాతీయ సంస్థాగత నాయకత్వంలో భారతీయ మహిళకు ఇంతటి కీలక బాధ్యతలు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఈ ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు

National

By Shekar

27 Sept 2026

ఈ ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు

వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో కేంద్రం, ఆర్బీఐ కీలక నిర్ణయం

న్యూ ఢిల్లీ: వినియోగదారుల సౌలభ్యం దృష్ట్యా ఈ నెల 27, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్  అనుమతి మంజూరు చేసింది.బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక  సెప్టెంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీనికి ముందు సెప్టెంబరు 26, 27  వారాంతపు సెలవులు కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించే పరిస్థితి ఏర్పడింది. 

సుదీర్ఘ విరామం వల్ల ఖాతాదారులకు తీవ్ర ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.కేంద్రం సూచనల మేరకు సెప్టెంబరు 27న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఏటీఎం అనుసంధాన విభాగాలు, కరెన్సీ చెస్ట్‌లు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. 

ఖాతాదారుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని తెలిపిన కేంద్రం.. ప్రతిపాదిత సమ్మెను విరమించుకోవాలని బ్యాంకు యూనియన్లకు విజ్ఞప్తి చేసింది. అత్యవసర బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది.

పారదర్శక పాలనకు పట్టం.. ఏపీ సోషల్ ఆడిట్‌కు ‘స్కోచ్ గోల్డ్’

National

By Shekar

26 Sept 2026

పారదర్శక పాలనకు పట్టం.. ఏపీ సోషల్ ఆడిట్‌కు ‘స్కోచ్ గోల్డ్’

దేశంలోనే తొలిసారిగా పురస్కారం దక్కించుకున్న రాష్ట్ర సంస్థ

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 26 (న్యూస్ డెక్): గ్రామాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ‘సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ’ (SSAAT) సంస్థ జాతీయ స్థాయి ‘స్కోచ్ గోల్డ్’ (SKOCH Gold) పురస్కారాన్ని దక్కించుకుంది. దేశంలో ఒక రాష్ట్ర సోషల్ ఆడిట్ విభాగానికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. దిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో జరిగిన 109వ ‘స్కోచ్’ సదస్సులో ఏపీ సోషల్ ఆడిట్ డైరెక్టర్ జి.శ్రీకాంత్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశంలో సామాజిక తనిఖీ వ్యవస్థను ప్రభుత్వం పటిష్ఠపరిచింది. గ్రామసభలు, ప్రజావేదికల ప్రత్యక్ష ప్రసారాలు, నివేదికల డిజిటలైజేషన్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచింది. ఏటా దాదాపు 13,396 తనిఖీలను నిర్వహిస్తూ, 2024-25లో 8.9 లక్షలు, 2025-26లో 9.18 లక్షల పనులపై ఆడిట్ పూర్తి చేశారు. అంతేకాకుండా 43.4 లక్షల ఉపాధి హామీ శ్రామిక కుటుంబాలను నేరుగా కలిసి అభిప్రాయాలు, సమస్యలను సేకరించారు. 

రాష్ట్రంలో అమలవుతున్న ఈ వినూత్న విధానాలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే 22 రాష్ట్రాల ప్రతినిధులు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషి, ప్రజల భాగస్వామ్యం వల్లే ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైందని డైరెక్టర్ జి.శ్రీకాంత్ పేర్కొన్నారు.

బాంబే‌లో సమాఖ్య గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ పోస్టర్ ఆవిష్కరణ

National

By Shekar

26 Sept 2026

బాంబే‌లో సమాఖ్య గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ పోస్టర్ ఆవిష్కరణ

అక్టోబరు 13 నుంచి 15 వరకు హైదరాబాద్ లో సదస్సు

బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ హాజరు 

ముంబయి(న్యూస్ డెక్): పారిశ్రామిక రంగంలో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్టోబరు 13 నుంచి 15 వరకు హైదరాబాద్‌ వేదికగా ‘సమాఖ్య 2026 గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌’ను నిర్వహించనున్నట్లు ‘సమాఖ్య చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ ప్రకటించింది. బృహస్పతి గ్రూప్‌ ఆధ్వర్యంలో ముంబయిలోని ఔరికా హోటల్‌లో నిర్వహించిన సన్నాహక సదస్సులో ఈ సదస్సు అధికారిక పోస్టర్‌ను ప్రముఖులు ఆవిష్కరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. సంప్రదాయ వ్యాపారాలతో పాటు కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి భవిష్యత్‌ సాంకేతికతల్లో యువత రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. స్టార్టప్‌ ఇండియా, ముద్ర రుణాల వంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తోందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌రావ్‌ నాయక్‌ మాట్లాడుతూ.. దేశ పారిశ్రామిక ప్రగతిలో భాగస్వామ్యం ఎంతో కీలకమని, తమ రాష్ట్ర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ వర్గాల సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మహాసదస్సుకు సన్నాహకంగా దిల్లీ, బెంగళూరు, చెన్నైలలోనూ ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.