Newsdecc

Latest News

తెలంగాణ పట్టభద్రుల MLC పోరులో జనసేన

Latest News

By Shekar

17 Oct 2026

తెలంగాణ పట్టభద్రుల MLC పోరులో జనసేన

జనసేన పార్టీ రాబోయే ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు పేరు ఖరారు చేసింది.తెలంగాణలో జనసేన పార్టీ నేరుగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవడం ఆసక్తిని పెంచుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని యువత,పట్టభద్రులకు పవన్ కళ్యాన్ విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలోనే ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ ప్రచార రథాన్ని ప్రారంభించారు.ఈ వాహనం 120 రోజుల పాటు ప్రజల్లో తిరుగుతూ పట్టభద్రుల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకునే వేదికగా పనిచేయాలని పవన్ కళ్యాన్ సూచించారు.

ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావుకు మద్దతుగా రూపొందించిన ‘ జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ’ ప్రచార రథాన్ని పవన్ కళ్యాణ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు.జనసేన పార్టీ తెలంగాణలోనే స్థాపించబడిందని గుర్తుచేస్తూ ఇక్కడి ప్రజలతో పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు.

పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం :'రణబాలి'

Entertainment

By Shekar

16 Oct 2026

పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం :'రణబాలి'

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన మూవీ 'రణబాలి'. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.'గీత గోవిందం','డియర్‌ కామ్రేడ్‌`' చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తోన్న మూవీ.పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం. పీరియాడికల్‌ హిస్టరీ యాక్షన్‌ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు.1870-80 ప్రాంతంలో ఓ వైపు కరువు వెంటాడుతుంటుంది.మరోవైపు బ్రిటీష్‌ వాళ్లు ధాన్యాన్ని దోచుకొని పోతుంటారు.ప్రజలు ఆకలితో అలమటిస్తున్న రోజులవి.బ్రిటీష్‌ వాళ్లు వచ్చి అక్కడి ధాన్యాన్ని కొల్లగొడతారు.వారికి అండగా నిలుస్తాడు రణబాలి.చాలా ఊర్ల ప్రజలకు ఆకలి తీరుస్తాడు. ఈ క్రమంలో బ్రిటీష్‌ వారితో పోరాడతాడు.

ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా విజయ్, రష్మిక ట్రాక్ ఉండటం ప్లస్ పాయింట్స్.బీజీఎం సినిమాని ఎలివేట్ చేస్తుంది.సెకండాఫ్ విషయానికి వస్తే చాలా వరకు సాగదీసినట్టుగా అనిపిస్తుంది.రాహుల్ సంకృత్యాన్ విజన్‌కి తగ్గట్టుగా అన్ని టీంలు అద్భుతంగా పని చేశాయి.ఈ సినిమాకి టెక్నికల్ టీం అతి పెద్ద బలం. డైలాగ్స్ మరీ అంత గొప్పగా అనిపించవు. ఏందయ్య సామీ పాట అయితే ట్రీట్‌లా ఉంటుంది.

నటీనటుల విషయానికి వస్తే విజయ్ తన గత సినిమాలతో పోలిస్తే అద్భుతంగా చేసేశాడు.  రణబాలి పాత్ర కోసం మారిన తీరు, మాటలు పలికించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. ఇక జయమ్మగా రష్మిక తన పాత్రకు న్యాయం చేస్తుంది. అసలు ఈ ఇద్దరినీ తెరపై చూస్తుంటే నిజంగానే ముచ్చటేస్తుంది. బిట్రీష్ ఆఫీసర్లుగా నటించిన వారు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ బాగానే నటించారు.పిరియాడిక్ నేపథ్యంగా సాగే ఈ సినిమాను దర్శకుడు రాహుల్ నిజాయితీగా కథను చెప్పారు. అలాగే పాత్రలను నమ్మి విజయ్ దేవరకొండ, రష్మిక అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాటోగ్రఫి తదితర అంశాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

రేటింగ్ : 3/5

"గ్లాసు" పార్టీ లో చేరిన వంగవీటి రాధ.విజయవాడ మేయర్‌ రేసులో రాధా?

Latest News

By Shekar

14 Oct 2026

"గ్లాసు" పార్టీ లో చేరిన వంగవీటి రాధ.విజయవాడ మేయర్‌ రేసులో రాధా?

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. విజయవాడ రాజకీయాల్లో బలమైన నేపథ్యం ఉన్న రాధా చేరిక అందరి దృష్టిని ఆకర్షించింది. విజయవాడ మేయర్ పదవికి జనసేన ఆయనను పరిశీలించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, మేయర్ అభ్యర్థుల విషయంలో ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పరిణామాలు కూటమి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అదే సమయంలో, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు మరియు ఇతర కూటమి నాయకులు సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

TUWJ launches 'Postcard Campaign' in Delhi demanding journalists' welfare

National

By Shekar

14 Oct 2026

TUWJ launches 'Postcard Campaign' in Delhi demanding journalists' welfare

New Delhi: Expressing concern over the continued neglect of journalists who serve as the fourth pillar of democracy, Indian Journalists Union (IJU) National Executive Member and TUWJ Delhi in-charge Avvari Bhaskar demanded the immediate resolution of their pending health and welfare issues. To press for these demands, the Telangana Union of Working Journalists (TUWJ H-143) launched a 'Postcard Campaign' in the national capital.

Speaking as the chief guest at the TUWJ Delhi Unit committee meeting held at Gurajada Hall in Telangana Bhavan on Wednesday, Bhaskar called upon all journalists to take their grievances directly to the Chief Minister through postcards. He highlighted that journalists operating out of New Delhi, far from their home state, work tirelessly round the clock braving extreme heat, rain, and severe pollution, making comprehensive health security an absolute necessity.

He demanded that the state government immediately issue health cards and allocate housing plots to all eligible journalists to ensure security for their families. Furthermore, he urged the government to expedite the implementation of pension facilities, honorariums, and the resolution of all other pending welfare issues. Bhaskar expressed deep anguish that despite bringing these issues to the government's attention for years, a complete solution remains elusive. He noted that the primary objective of the postcard campaign is to build pressure on the government.

He stated that this initiative is being carried out in response to the TUWJ State Committee's call for a united agitation to resolve journalists' issues statewide. Bhaskar warned that if the government fails to respond positively to their rightful demands, the union will intensify its protests in a phased manner across the state.

The event saw the participation of TUWJ (H-143) Delhi President Nagilla Venkat, General Secretary Meka Gopikrishna, Treasurer Konnoju Raju, State Committee members Rajashekhar Reddy and Ashok Reddy, Advisors Mukkamala Satish, Secretary Nagaraju, Srikar, and others.

ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు షురు

State

By Shekar

10 Oct 2026

ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు షురు

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఇవాళ్టి (శనివారం)రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.చెరువులల్లో రాత్రిపూట భక్తితో వాటిని నిమజ్జనం చేస్తారు.9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ,రెండో రోజు అటుకుల బతుకమ్మ,ముద్దపప్పు,నానేబియ్యం,అట్ల, అలిగిన,వేపకాయ బతుకమ్మ,వెన్నముద్దల బతుకమ్మల ఉత్సవాలను ఘనంగా జరుగుతాయి.చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు.

మహిళలు ఎంతో ఉత్సాహంగా తంగేడు,గునుగు,బంతి,చామంతి వంటి రకరకాల సహజ పూలను సేకరించి,గౌరమ్మను అందంగా పేర్చి అలంకరిస్తారు.సాయంత్రం వేళల్లో బతుకమ్మ చుట్టూ చేరి సాంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ, నృత్యాలు చేస్తూ ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

ఎంగిలిపూలు’ అనే పేరు ఎందుకు? 

ఎంగిలిపూల బతుకమ్మ పేరుకు సంబంధించి తెలంగాణలో వివిధ జానపద విశ్వాసాలు, ఆచారాలు ఉన్నాయి. పూలను ఏరుకుని బతుకమ్మను పేర్చే విధానానికి సంబంధించిన స్థానిక సంప్రదాయాలతో ఈ పేరు ముడిపడి ఉందని చెబుతారు. పితృదేవతలను స్మరించే పర్వదినంతోనూ తొలి రోజు అనుబంధం ఉందనే ఆచారం ఉంది. ఇవన్నీ జానపద సంప్రదాయాలుగా చూడాలి; ఎంగిలిపూల బతుకమ్మ పేరుకు ఒక్కటే ఖచ్చిత చారిత్రక వివరణ ఉందని చెప్పడం సరికాదు.

బతుకమ్మను ఎందుకు జరుపుతారు?

బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదు. భూమి, నీరు, ప్రకృతి, మనిషి మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక. వర్షాకాలం చివర్లో తెలంగాణ పల్లెలు, చెరువులు, పొలాల గట్ల వెంట అనేక రకాల అడవి పూలు విరబూస్తాయి. ఆ ప్రకృతి సౌందర్యాన్ని పూల రూపంలో కొలువుదీర్చి ఆరాధించడమే బతుకమ్మలోని ప్రధాన భావన.

ఎంగిలిపూల బతుకమ్మ రోజు ప్రాంతాన్ని బట్టి నైవేద్యాల్లో స్వల్పంగా మార్పులు కనిపిస్తాయి. సాధారణంగా నువ్వులు, బియ్యంపిండి, నూకలు వంటి పదార్థాలతో నైవేద్యం తయారు చేసే సంప్రదాయం ఉంది. కుటుంబ ఆచారం, ప్రాంతీయ సంప్రదాయం ఆధారంగా విధానంలో తేడాలు ఉండొచ్చు.

తొమ్మిది రోజుల పాటు గౌరీదేవికి సమర్పించే ప్రత్యేక నైవేద్యాలు?

బతుకమ్మ వేడుకల్లో భాగంగా మొదటి తొమ్మిది రోజులు గౌరీదేవిని కొలుస్తూ రోజూ భక్తిశ్రద్ధలతో రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజుల్లో ఒక్కో రోజుకు తగినట్లుగా ఎంగిలి పూలకు నువ్వులు-బియ్యం పిండి, అటుకులు, ముద్దపప్పు, నానబియ్యం, అట్లు, వేపకాయలు, వెన్నముద్దలు నివేదిస్తారు. అయితే ఆరో రోజున అలిగిన బతుకమ్మగా పరిగణించి ఆ రోజు ఎలాంటి నైవేద్యం సమర్పించరు. ఇక తొమ్మిదో రోజైన ‘పెద్ద బతుకమ్మ’ రోజు మాత్రం ఐదు రకాల రుచికరమైన ప్రత్యేక నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి వేడుకను ముగిస్తారు.

తెలంగాణ ఆడపడుచులంతా ఎంతో ఆత్మీయంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు నేడు శ్రీకారం చుడుతున్నారు. ప్రకృతిలో విరబూసే రంగురంగుల పూలను కొలువుదీర్చి.. మహిళలంతా ఒకచోట చేరి పాటలు పాడుతూ, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ సంబురాలు చేసుకోవడం ఈ పండుగ ప్రత్యేకత.

కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్

Entertainment

By Shekar

09 Oct 2026

కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్

మ‌రోసారి త‌న‌కు అచ్చొచ్చిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫార్ములాలోనే శ్రీవిష్ణు చేసిన లేటెస్ట్ మూవీ “కామ్రేడ్ క‌ళ్యాణ్‌”.న‌క్స‌లిజం ఉద్య‌మానికి వినోదాన్ని జోడించి తెర‌కెక్కించిన ఈ సినిమాకు జాన‌కిరామ్ మారెళ్ల‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.మ‌హిమా నంబియార్ హీరోయిన్‌గా స‌త్య‌,సుద‌ర్శ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు.రైట‌ర్ కోన వెంక‌ట్ ప్ర‌జెంట‌ర్‌గా, సీతా క‌ర్నాటి,వెంక‌ట కృష్ణ క‌ర్నాటి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.ఫస్ట్ హాఫ్ మొత్తానికి నిరాశపరుస్తుంది,సత్య కామెడీ తప్పా.సెకండ్ హాఫ్ లో మాత్రం శ్రీవిష్ణు,సత్య చేసే కామెడీ ఆకట్టుకుంటుంది.

సీనియ‌ర్ హీరోయిన్ రాధిక న‌ట‌నానుభ‌వాన్ని ద‌ర్శ‌కుడు స‌రిగ్గా వాడుకోలేదు.ప్రాంతంలోనే కల్యాణ్ (శ్రీ విష్ణు) సినిమా థియేటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు.ఒడిశా అమ్మాయి సితారను తొలిచూపులోనే కల్యాణ్ ప్రేమలో పడుతాడు.సితారాను పెళ్లి చేసుకొంటానని బ్లాక్ మెయిల్ చేస్తూ బిష్వాస్ (ఉపేంద్ర లిమాయే) అనే వడ్డీ వ్యాపారి వెంటాపడుతుంటాడు.అయితే సితార పరిస్థితి చూసి కల్యాణ్ అండగా నిలుస్తాడు.సత్తిబాబు (సత్య) టీమ్ చేసే స్కీం కారణంగా అడవిలో అన్నగా కల్యాణ్ కామ్రేడ్ అవుతాడు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీవిష్ణుకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే.కొత్తగా చేయాల్సిన అవసరమే కలుగలేదు.తన బాడీ లాంగ్వేజ్,హావభావాలు,తన మార్క్ డైలాగ్ డెలివరీతో సింపుల్‌గా పని కానిచ్చేశాడు.కమెడియన్ సత్య మరోసారి తన మార్కు కామెడీతో ఆకట్టుకొన్నాడు.ఫస్ట్ హాఫ్ మొత్తానికి నిరాశపరుస్తుంది,సత్య కామెడీ తప్పా.సెకండ్ హాఫ్ లో మాత్రం శ్రీవిష్ణు,సత్య చేసే కామెడీ ఆకట్టుకుంటుంది.విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ పరంగా ఒకే.తన మార్క్ పాటలు మిస్ అయ్యాయనే చెప్పాలి.కామ్రేడ్ క‌ళ్యాణ్‌కు టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌.శ్రీవిష్ణు,స‌త్య కామెడీ కోసం చూడొచ్చు.

రేటింగ్: 2/5.

Advocate Vinod Hindustani Vows Civil Court Action Over Delayed SC Fellowships..

Others

By Shekar

09 Oct 2026

Advocate Vinod Hindustani Vows Civil Court Action Over Delayed SC Fellowships..

Demands Equal Timelines for Marginalized Scholars

NEW DELHI — Practicing advocate and Social activist Vinod Hindustani has successfully exposed major administrative flaws causing delays in the National Fellowship for Scheduled Castes (NFSC), warning of severe legal escalation if the system is not permanently fixed. Through his targeted legal efforts, official government agencies have formally admitted they lack a fixed schedule to release these crucial research funds.  

The crisis stems from the December 2025 cycle of the UGC-NET examinations. While the general Junior Research Fellowship (JRF) results were released promptly, the NFSC list—meant to financially support marginalized SC students—was inexplicably stalled.  

To uncover the cause of this disparity, Advocate Hindustani filed a Right to Information (RTI) request with the National Scheduled Castes Finance and Development Corporation (NSFDC). On July 24, 2026, the NSFDC responded, explaining that they were entirely dependent on the National Testing Agency (NTA) to send the list of selected students. Crucially, the NSFDC admitted there is no Standard Operating Procedure (SOP) or agreed-upon timeline between the NTA, the UGC, and the Ministry of Social Justice to release the SC fellowship list simultaneously with the general JRF list.  

unresolved.  

Using this official RTI admission, Advocate Hindustani elevated the matter to the National Commission for Scheduled Castes (NCSC) on September 1, 2026, arguing that withholding this data is legally discriminatory.  

In response to the NCSC's intervention, the NSFDC submitted a formal defense on October 1, 2026, detailing a lengthy 10-step administrative process. The agency explicitly stated it has no independent authority to publish the results because it relies entirely on the NTA for candidate data and the Ministry for final approval. Because of this structural dependency, the NSFDC declared it cannot promise a fixed timeline for scholars. However, following the mounting legal pressure, the delayed December 2025 list was finally published on September 1, 2026—the exact day Mr. Hindustani filed his NCSC petition.  

On October 7, 2026, the NCSC forwarded these official findings to Advocate Hindustani, granting him a 30-day window to file a formal reply if his concerns regarding the systemic timeline gaps remain.

Addressing the media following the NCSC's communication, Advocate Hindustani made his future legal strategy clear. He stated that he will firmly fight and appeal in the civil courts if the systemic timeline issue is not permanently solved. He explicitly demanded the free and uninterrupted release of the NFSC in a timely manner alongside the general JRF list from now on, asserting his unwavering commitment to upholding the constitutional rights of marginalised students across the country.

రణబాలి ట్రైలర్: విజయ్ దేవరకొండ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం

Entertainment

By Shekar

08 Oct 2026

రణబాలి ట్రైలర్: విజయ్ దేవరకొండ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం

రణబాలి ట్రైలర్ విడుదలైంది.ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా యొక్క ప్రపంచం,పాత్రలు మరియు ప్రధాన సంఘర్షణ గురించి ఈ చిత్రం మనకు పరిచయం చేస్తుంది.1870వ దశకంలో దక్షిణ భారతదేశంలో వలస పాలన,కరువు కాలంలో ప్రతిఘటనకు ప్రతీకగా నిలిచిన ఒక యోధుడి కథే 'రణబాలి'.రణబాలి పాత్రను విజయ్ దేవరకొండ పోషించనున్నారు.అతని సమాజం సంక్షోభంతో పోరాడుతున్నప్పుడు,రణబాలి మరింత పెద్ద బాధ్యతను స్వీకరించవలసి వస్తుంది.దేశంలోని అనేక ప్రాంతాలపై బ్రిటిష్ వారి ఆధిపత్యం ఉన్న కాలానికి ప్రేక్షకులను తీసుకువెళుతుంది.ఇందులో రష్మిక పోషించిన జయమ్మ పాత్రతో అతనికి వైవాహిక బంధం ఉంటుంది.అతనికి ప్రత్యర్థిగా నిలిచే బ్రిటిష్ అధికారి 'సర్ థియోడర్ హెక్టర్' పాత్రలో ఆర్నాల్డ్ వోస్లూ నటించారు.

3 నిమిషాల 56 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్, సింగనమల కొండకు చెందిన రణబాలి గురించిన ఒక జానపద ప్రదర్శనతో ప్రారంభమవుతుంది.ఆ జానపద కథ ప్రకారం,చాలా సంవత్సరాల క్రితం ఒక గుహలో ఒక స్త్రీ అతనికి జన్మనిచ్చిందని, అతను గొప్పవాడు అవుతాడని తరువాత నమ్మేవారు.గ్రామస్థులు బ్రిటిష్ వారి కోసం కూలీలుగా పనిచేస్తూ,దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ట్రైలర్ చూపిస్తుంది.తన గ్రామం భయంకరమైన కరువు బారిన పడినప్పుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిలబడే నిర్భయ యోధుడిగా విజయ్‌ను ఆవిష్కరిస్తుంది.

'టాక్సీవాలా' తర్వాత విజయ్ మరియు రాహుల్ కలయికలో వస్తున్న చిత్రం 'రణబాలి'.మైత్రీ మూవీ మేకర్స్ మరియు టి-సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించారు.'రణబాలి' 2026 అక్టోబర్ 16న తెలుగు,తమిళం,కన్నడ,మలయాళ మరియు హిందీ భాషల్లో విడుదలవుతుంది.

వికసిత్ భారత్ దిశగా పౌల్ట్రీ పరిశ్రమ

Business

By Shekar

08 Oct 2026

వికసిత్ భారత్ దిశగా పౌల్ట్రీ పరిశ్రమ

న్యూ ఢిల్లీ : దేశీయ పౌల్ట్రీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 18వ ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026’కు హైదరాబాద్‌ నగరం వేదిక కానుంది. నవంబరు 25 నుంచి 27 వరకు మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ మహా ప్రదర్శన జరగనుంది. ఈ మేరకు గురువారం దిల్లీలోని ‘ది పార్క్’ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ప్రతినిధులు వివరాలు వెల్లడించారు.

24న నాలెడ్జ్ డే సదస్సు

ఎక్స్‌పో ప్రారంభానికి ముందురోజు, నవంబరు 24న హెచ్‌ఐసీసీ–నోవోటెల్‌లో ‘నాలెడ్జ్ డే’ పేరుతో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. కోళ్ల ఆరోగ్యం, దాణా నిర్వహణ, బయోసెక్యూరిటీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పౌల్ట్రీ రంగంలో సుస్థిర పద్ధతులపై నిపుణులు విస్తృతంగా చర్చించనున్నారు. అనంతరం 25 నుంచి 27 వరకు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిబిషన్ సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.

550కి పైగా సంస్థలు.. 120 దేశాల నిపుణులు

ఈ ప్రదర్శనలో 550కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులు, సేవల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి సుమారు 51 వేల మందికి పైగా పరిశ్రమ ప్రతినిధులు, పౌల్ట్రీ రైతులు, బ్రీడర్లు, పశువైద్యులు, పరిశోధకులు హాజరుకానున్నారు. జన్యు సాంకేతికత, అత్యాధునిక హేచరీలు, ఫార్మ్ ఆటోమేషన్, పౌల్ట్రీ షెడ్లు, వెంటిలేషన్ వ్యవస్థలు, వ్యాధి నిర్ధారణ పరికరాలు, గుడ్ల ప్రాసెసింగ్, వ్యర్థాల నిర్వహణ వంటి విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఐపీఈఎంఏకు ఇప్పటికే 20కి పైగా అంతర్జాతీయ సంఘాలు, 40 జాతీయ స్థాయి సంస్థలతో భాగస్వామ్యం ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఉత్పత్తిలో దూకుడు

దేశంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో 142.77 బిలియన్ గుడ్లు ఉత్పత్తి కాగా, భారత్ అంతర్జాతీయంగా రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. బ్రాయిలర్ మాంసం ఉత్పత్తిలోనూ ప్రపంచంలోనే తొలి నాలుగు స్థానాల్లో ఒకటిగా నిలిచిందని ఐపీఈఎంఏ పేర్కొంది. గతేడాది సుమారు 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరిగిన ఎక్స్‌పోలో 500కు పైగా సంస్థలు, 51,251 మంది ప్రతినిధులు పాల్గొన్నట్లు వివరించింది.

"రాబోయే రోజుల్లో పౌల్ట్రీ పరిశ్రమలో అనేక సంస్కరణలు, ఆధునిక పోకడలు రానున్నాయి. యువత ఈ రంగంలో విస్తరిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి."

ఉదయ్ సింగ్ బయాస్, పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు

సీఈసీ రాజీనామా చేయాల్సిందే.. ‘ఇండి’ కూటమి

National

By Shekar

07 Oct 2026

సీఈసీ రాజీనామా చేయాల్సిందే.. ‘ఇండి’ కూటమి

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష ‘ఇండి’ కూటమి దేశ రాజధానిలో చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, సీఈసీ వైదొలగాలనే ఏకైక డిమాండ్‌తో విపక్ష ఎంపీలు జంతర్‌మంతర్‌ ముట్టడికి యత్నించారు. అయితే, అనుమతి లేదంటూ వారిని అశోకా రోడ్డు వద్దే దిల్లీ పోలీసులు బలవంతంగా నిలువరించి అదుపులోకి తీసుకున్నారు.

రాజీనామా చేసేవరకూ పోరాటం ఆగదు: రాహుల్‌ గాంధీ

జంతర్‌మంతర్‌ బయలుదేరడానికి ముందు దిల్లీలోని సాగర్ రత్న హోటల్ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ సీఈసీపై నేరుగా విరుచుకుపడ్డారు:

‘‘జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని, ఆయన రాజీనామా సమర్పించేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ దేశంలో అత్యంత పవిత్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకే మేం పోరాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మాపై ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయం. నాపై వంద ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా సంతోషమే.. ఆ కేసులను గౌరవప్రదమైన పతకాలుగా భావిస్తాం. ఎన్నికల సంఘం పాల్పడుతున్న అరాచకాలను దేశవ్యాప్తంగా ప్రతి వీధికీ తీసుకెళ్తాం.’’ అని రాహుల్ అన్నారు.

అశోకా రోడ్డుపై ఉద్రిక్తత.. ఎంపీల నిర్బంధం

హోటల్‌ నుంచి మూడు ప్రత్యేక బస్సుల్లో విపక్ష ఎంపీలు జంతర్‌మంతర్‌ వైపు బయలుదేరగా, అశోకా రోడ్డు వద్ద భారీగా మోహరించిన పోలీసులు, కేంద్ర బలగాలు బారికేడ్లతో ఆ కాన్వాయ్‌ను అడ్డగించాయి. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకు ఉందంటూ ఎంపీలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

పోలీసులు నాపై దాడి చేశారు: ప్రియాంక గాంధీ ఆగ్రహం

పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా నడిరోడ్డుపై పడుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.‘‘ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని కోరుతున్న పార్లమెంట్ సభ్యుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? పోలీసులు నన్ను కిందపడేసి ఈడ్చుకెళ్లారు. నా చేతులు, శరీరమంతా రక్కేశారు. మహిళా ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. మేం ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు’’ అని ప్రియాంక ధ్వజమెత్తారు. సీఈసీ రాజీనామా కోరుతూ సాగిన ఈ ఆందోళనలతో దిల్లీ నడిబొడ్డున భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎన్నికల సంఘం పారదర్శకతను కోల్పోయిందని, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని విపక్ష కూటమి నేతలు స్పష్టం చేశారు

పల్లెల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

State

By Shekar

06 Oct 2026

పల్లెల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు ఈ కార్డుల పంపిణీ పూర్తయింది.దాదాపు 90 శాతం లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా ఈ ఫిజికల్ కార్డులను అందించారు.1.05 కోట్లకు పైగా అర్హులైన కుటుంబాలకు సంబంధించి, సంప్రదాయ కాగితపు కార్డుల స్థానంలో QR-సదుపాయం కలిగిన, క్రెడిట్-కార్డ్ పరిమాణంలో ఉండే కొత్త PVC స్మార్ట్ రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తోంది.దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లా ,ఆత్మకూర్ (ఎస్) మండలం,ఇస్థలాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మధు(VRO),సునీత(GPO), ఇరుగూ ప్రమీల కృష్ణకుమార్(సర్పంచ్),తూడి రాములు(ఉప సర్పంచ్),మర్రు అబ్బయ్య,కప్పల చంద్రశేఖర్...తదితరులు పాల్గొన్నారు.

మెడికవర్ ఆసుపత్రి బయట రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బ్యానర్లు

State

By Shekar

05 Oct 2026

మెడికవర్ ఆసుపత్రి బయట రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బ్యానర్లు

సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రి వెలుపల, సుమారు రూ. 13,200 కోట్ల విలువైన లావాదేవీని ప్రస్తావించే బ్యానర్లు వెలుగుచూడటంతో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ ఘర్షణ తీవ్రతరమైంది.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబదించిందంటూ వ్యాపార సంబంధాల విషయంలో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బిఆర్‌ఎస్ మధ్య రాజకీయ ఘర్షణ తీవ్రమవుతున్న తరుణంలో,ఆదివారం నాడు సికింద్రాబాద్‌లోని మెడికోవర్ ఆసుపత్రి బయట "అభినందనలు రేవంత్ గారు — రూ. 13,200 కోట్లు" అనే సందేశంతో కూడిన బ్యానర్లు కనిపించాయి.సమాచారం అందుకున్న గోపాలపురం పోలీసులు అక్కడికి చేరుకుని ఫ్లెక్సీలను తొలగించారు. జీహెచ్‌ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రి బయట ఆదివారం (అక్టోబర్ 4న) భారీ బ్యానర్లు ఏర్పాటు చేశారు;వీటిపై రూ.13,200 కోట్ల అనే అంకెలు ప్రదర్శించబడ్డాయి.ఈ ఆసుపత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెట్టుబడులు ఉన్నాయన్న ఆరోపణకు సంబంధించి ఈ అంకెలను అక్కడ ఉంచారు.ఆ బ్యానర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాలు ఉండి, "అభినందనలు శ్రీ రేవంత్ రెడ్డి గారు" అనే సందేశం ఉంది.

రేపు అది మీకు,నాకు లేదా మనకు తెలిసిన ఎవరికైనా జరగవచ్చు: చిరంజీవి

State

By Shekar

04 Oct 2026

రేపు అది మీకు,నాకు లేదా మనకు తెలిసిన ఎవరికైనా జరగవచ్చు: చిరంజీవి

‘దేవర: పార్ట్ 1’ చిత్రంలోని జూనియర్ ఎన్టీఆర్,జాన్వీ కపూర్‌లతో  AI ద్వారా మార్ఫింగ్ చేసిన వీడియో ప్రచారమవడాన్ని నటుడు చిరంజీవి ఖండించారు.AI దుర్వినియోగానికి వ్యతిరేకంగా పరిశ్రమ సమన్వయం,కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మహిళలను లక్ష్యంగా చేసుకుని,వారిని కించపరిచే విధంగా AI కంటెంట్‌ను రూపొందించడాన్ని "క్రూరమైనది,సిగ్గుచేటైనది మరియు పూర్తిగా ఆమోదయోగ్యం కానిది" అని అభివర్ణిస్తూ,ఈ విషయాన్ని తాను కీలకమైన తెలుగు చిత్ర పరిశ్రమ సంస్థల దృష్టికి తీసుకువెళ్తానని,అలాగే ఇటువంటి వేధింపులకు గురైన వారి కోసం ఒక ప్రత్యేక సహాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆ నటుడు తెలిపారు.

"ఒక మహిళకు సంబంధించిన అవమానకరమైన మరియు మార్పులు చేసిన (మార్ఫ్ చేసిన) వీడియోలను రూపొందించడానికి AI ని ఉపయోగించడం నన్ను తీవ్రంగా కలచివేసింది.ఇటువంటి చర్యలు క్రూరమైనవి, సిగ్గుచేటైనవి మరియు ఏమాత్రం ఆమోదయోగ్యం కానివి.నేను వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాను.ఇది కేవలం ఒక వ్యక్తికి లేదా ఒక సినిమాకు సంబంధించిన సమస్య కాదు.ఈ రోజు ఇది మరొకరికి జరిగింది;రేపు ఇది మీకు,నాకు లేదా మనకు తెలిసిన ఎవరికైనా జరగవచ్చు," అని చిరంజీవి పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు ఇదే సంఘటనను ఖండించారు,అవమానకరమైన వీడియోను రూపొందించడానికి ఏఐని ఉపయోగించడాన్ని "అసహ్యకరమైన, రోత పుట్టించే మరియు సిగ్గుమాలిన చర్య" అని అభివర్ణించారు.ఒక మహిళను ఈ విధంగా అవమానించడానికి సాంకేతికతను ఉపయోగించడం "మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు" అని ఆయన నొక్కి చెప్పారు.

మొదటిసారి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చేయటం యెంతో సంతోషంగా ఉంది : యువ యూత్ సభ్యులు(ఇస్తలాపురం)

State

By Shekar

04 Oct 2026

మొదటిసారి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చేయటం యెంతో సంతోషంగా ఉంది : యువ యూత్ సభ్యులు(ఇస్తలాపురం)

2026 శారదీయ దేవీ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి.స్థానిక యువజన సంఘాలు మరియు యువసేనలు విస్తృతమైన నిర్వహణ ఏర్పాట్లు చేయడంలోనూ, భారీ పండళ్లను ఏర్పాటు చేయడంలోనూ చురుకుగా పాల్గొంటున్నాయి.వారి సన్నాహాల్లో ఒక ముఖ్యమైన భాగం,తమ ప్రాంతంలోని మండపాల కోసం అమ్మవారి (దుర్గాదేవి) అత్యుత్తమ విగ్రహాన్ని ఎంపిక చేసి కొనుగోలు చేయడం.అమ్మవారి విగ్రహం కొనుగోలులో భాగంగా హైదరాబాద్‌లోని నాగోలులో కొందరు యువకులు తారసపడ్డారు.

తెలుగు పంచాంగం ప్రకారం, ఆశ్వయుజ శుక్ల పాడ్యమి తిథి అక్టోబర్ 11న సూర్యోదయంతో ప్రారంభం అవుతుండటంతో అదే రోజున ఘటస్థాపన (కలశ స్థాపన) నిర్వహించనున్నారు. అక్టోబర్ 20న విజయదశమి (దసరా) వేడుకలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.దేవీ నవరాత్రులు (శరన్నవరాత్రులు) ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు అంగరంగ వైభవంగా జరుపుకునే విశిష్టమైన శక్తి ఆరాధన పండుగ. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో జగన్మాతను వివిధ రూపాల్లో భక్తులు కొలుస్తారు.

చిత్రసీమలో తీవ్ర విషాదం: సీనియర్ దర్శకుడు సింగీతం మృతి

Entertainment

By Shekar

04 Oct 2026

చిత్రసీమలో తీవ్ర విషాదం: సీనియర్ దర్శకుడు సింగీతం మృతి

సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనారోగ్యంతో చెన్నయ్‌లో తుది శ్వాస విడిచారు.ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో కన్నుమూశారు.వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన చివరిసారిగా దర్శకత్వం వహించిన 'సింగ్‌ గీతం' చిత్రం ఇటీవలే విడుదలైంది.ఈ సినిమాను నాగ అశ్విన్‌ నిర్మించారు.94 సంవత్సరాల వయసులో దర్శకత్వం వహించిన తొలి భారతీయ దర్శకుడిగా ఆయన రికార్డ్ సృష్టించారు.

1932లో మొదటి తెలుగు సినిమా పుట్టింది.దానికి ఒక సంవత్సరం ముందు సెప్టెంబర్ 21వ తేదీన సింగీతం శ్రీనివాసరావు జన్మించారు.నాటక రంగంలో తొలుత అరంగేట్రం సాగించి,చిత్రసీమలో స్థిరమైన-ఉన్నతమైన దర్శక స్థానాన్ని పొందిన వ్యక్తి శ్రీనివాసరావు.

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సింగీతం శ్రీనివాసరావును నిజమైన దార్శనికుడిగా అభివర్ణిస్తూ ఆయనతో తన అనుబంధాన్ని,సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.వయసు పెరిగినా మనసులో మాత్రం సింగీతం ఎప్పుడూ యువకుడిగానే ఉండేవారని చిరంజీవి గుర్తుచేశారు.కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి,కొత్తగా ఏదైనా సృష్టించాలనే తపన సింగీతం శ్రీనివాసరావులో చివరి వరకు కొనసాగాయని చిరంజీవి అన్నారు.అలాంటి సృజనాత్మక దార్శనికుడిని కోల్పోవడం తెలుగు,భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.సింగీతం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలిపారు.సింగీతం గారిని తామంతా మిస్ అవుతామని,అయితే ఆయన తెరకెక్కించిన సినిమాలు తరతరాల ప్రేక్షకులతో ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాయని అన్నారు.చివరగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ‘ఓం శాంతి’ అంటూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

భారతీయ చలన చిత్ర పరిశ్రమకు సింగీతం శ్రీనివాసరావు విభిన్నమైన చిత్రాలను అందించారని పవన్‌ కల్యాణ్ అన్నారు.‘పుష్పక విమానం’,‘విచిత్ర సోదరులు’,‘మయూరి’,‘ఆదిత్య 369’,‘మైకేల్‌ మదన కామరాజు’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన ప్రయోగాలు,చూపిన సృజనాత్మకత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.అలాగే ‘అమెరికా అమ్మాయి’,‘పంతులమ్మ’ వంటి చిత్రాల్లోని గీతాలు కూడా విశేష ప్రజాదరణ పొందాయని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్‌ గీతం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా ఆయనకు సినిమాపై ఉన్న అంకితభావం,ఆసక్తి స్పష్టమవుతాయని అన్నారు.సింగీతం శ్రీనివాసరావు మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ.ఆయన కుటుంబ సభ్యులకు పవన్‌ కల్యాణ్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మెట్రోలో మంత్రుల సందడి.. కామన్ పాస్ సేవలను పరిశీలించిన మంత్రుల బృందం

State

By Shekar

03 Oct 2026

మెట్రోలో మంత్రుల సందడి.. కామన్ పాస్ సేవలను పరిశీలించిన మంత్రుల బృందం

హైదరాబాద్: ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 'మెట్రో - ఆర్టీసీ బస్ కామన్ పాస్' సేవలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు నవీన్ యాదవ్, శ్రీగణేష్ తదితరులు పాల్గొని ఆర్టీసీ బస్సు, మెట్రో రైళ్లలో ప్రయాణించారు.

ప్రజాభవన్ వద్ద ప్రత్యేక ఆర్టీసీ బస్సులో బయలుదేరిన ప్రజాప్రతినిధుల బృందం తొలుత బేగంపేట మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ నూతన కామన్ పాస్‌ను స్వయంగా వినియోగించి టికెటింగ్ వ్యవస్థ పనితీరును పరిశీలించిన అనంతరం, మెట్రో రైలు ఎక్కి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులతో మాట్లాడి కొత్త పాస్ ద్వారా కలుగుతున్న వెసులుబాటు, రవాణా సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. మెట్రో, ఆర్టీసీలకు ఒకే కామన్ పాస్ అందుబాటులోకి రావడం వల్ల నగరవాసులకు ప్రయాణం మరింత సులభతరం, వేగవంతం అవుతుందన్నారు. సమయం, ఆదాతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని చెబుతూ, ప్రజలంతా ఈ సదుపాయాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి:అనంత్‌ అంబానీ

Latest News

By Shekar

03 Oct 2026

నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి:అనంత్‌ అంబానీ

అన్నమయ్య జిల్లా: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు."నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి",రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి’ అని సీఎం చంద్రబాబును రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కోరారు.

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ పాల్గొన్నారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ శంకుస్థాపన కార్యక్రమంలో తన ప్రసంగంతో అనంత్  అంబానీ ఆకట్టుకున్నారు. ప్రసంగం అనంతరం అనంత్ అంబానీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయనను అప్యాయంగా సీఎం చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై తప్పుడు ప్రచారాలకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టీకరణ

State

By Shekar

02 Oct 2026

ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై తప్పుడు ప్రచారాలకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టీకరణ

నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా పేరును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ఎన్నికల బరిలో నిలుస్తున్నాను.

అయితే నా అభ్యర్థిత్వంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టికెట్ అడగలేదు, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, చేతులెత్తేశారు, యూ టర్న్ తీసుకున్నారు అంటూ ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవం.

నేను ఎప్పుడూ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంటానని చెప్పలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం నా స్పష్టమైన నిర్ణయం.

పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో స్వీకరిస్తున్నాను. పట్టభద్రులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ, ప్రభుత్వం మరియు సంబంధిత వేదికల దృష్టికి తీసుకెళ్లడం నా ప్రధాన లక్ష్యం.

నా దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాల గురించి నేను గతంలో చెప్పిన విషయాలను ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలతో ముడిపెట్టి వక్రీకరించడం సరికాదు. ప్రస్తుతం నా ముందున్న బాధ్యత ఒక్కటే — కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి, పట్టభద్రుల సమస్యలకు బలమైన ప్రాతినిధ్యం వహించడం.

ఇక “రెండు సీట్లు రెడ్లకే ఇవ్వడంతో బీసీ వర్గాల్లో ఆగ్రహం వచ్చిందని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థిని మార్చబోతోందని” చేస్తున్న ప్రచారానికి కూడా ఎలాంటి ఆధారం లేదు. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఊహాగానాలను ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం.

కాంగ్రెస్ పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎన్నికల బరిలో ఉన్నాను. పట్టభద్రుల ఆశీస్సులతో ముందుకు సాగుతాను.

ప్రచారం చేసేవారు ఏం చెప్పినా, నా వైఖరి స్పష్టమైనది కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పట్టభద్రుల సమస్యల కోసం పోరాడుతాను. ప్రజల తీర్పును గౌరవిస్తానని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రకటించారు.

దిల్‌సుఖ్‌నగర్‌ ఆలయంలో దారుణం.అమ్మవారి విగ్రహంపై కర్రతో దాడి

State

By Shekar

02 Oct 2026

దిల్‌సుఖ్‌నగర్‌ ఆలయంలో దారుణం.అమ్మవారి విగ్రహంపై కర్రతో దాడి

దిల్‌సుఖ్‌నగర్‌ సంతోషిమాత ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి  అమ్మవారి విగ్రహంపై కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనను గమనించిన భక్తులు వెంటనే అతడిని అడ్డుకుని పట్టుకున్నారు. అనంతరం చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.శుక్రవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించగా.అతడి చేతిలో ఉన్న కర్రతో పూజారిపై దాడికి ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Flydubai Flight : ఫ్లైదుబాయ్ విమానం ఘ‌ట‌న‌

International

By Shekar

01 Oct 2026

Flydubai Flight : ఫ్లైదుబాయ్ విమానం ఘ‌ట‌న‌

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) వెళ్లాల్సిన ఫ్లైదుబాయ్ సంస్థ‌కు చెందిన విమానం సౌదీ అరేబియాలోని ట‌బుకులో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయిన సంగ‌తి తెలిసిందే.అయితే, ఈలోపు విమానం హైజాక్ అయిన‌ట్లు కంట్రోల్ రూంకు కోడ్ అల‌ర్ట్ వెళ్లింది. దీంతో నిజంగానే ఫ్లైట్ హైజాక్ అయ్యిందేమో అన్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఈ విష‌యంలో ప్ర‌స్తుతం కొన్ని ప్రాథ‌మిక అంశాలు వెల్ల‌డయ్యాయి. 

ఈ ఘటనలో ఉగ్రవాద కోణం ఉండొచ్చని ఇజ్రాయెల్ అధికారులు తమ అంచనాను మార్చుకున్నారు. ఇద్దరు పైలట్ల మధ్య ‘తీవ్ర ఘర్షణ’ జరిగిన తర్వాత విమానాన్ని దారి మళ్లించినట్లు తెలిపారు. సుమారు 180 మంది ప్రయాణికులతో ఉన్న విమానంలో కో-పైలట్, పైలట్‌ను కత్తితో పొడిచాడు. అనంతరం విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు. అనంతరం రెండవ పైలట్ల బృందం, బుధవారం సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసింది.

 ప్రయాణికులు సురక్షితం

పైలట్ల మధ్య ఘర్షణతో విమానం ఒక్కసారిగా 17,400 అడుగుల మేర కిందికి దిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం దానిని దారి మళ్లించి సౌదీలో సురక్షితంగా ల్యాండ్​ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పైలట్, కో-పైలట్ ఇద్దరూ గాయపడి ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పరిస్థితి “అదుపులో ఉంది” అని పేర్కొంది. పైలట్​ తీవ్ర గాయాలతో ఉన్న విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారని ప్రయాణికులు పేర్కొన్నారు.

శివ కేశవులు వేరనటం వెర్రితనమే…

National

By Shekar

01 Oct 2026

శివ కేశవులు వేరనటం వెర్రితనమే…

సీఎం వాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిప్పులు

దిల్లీ: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 ఉప హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రజల దృష్టి మళ్లించేందుకే దేవుళ్ల మధ్య చిచ్చుపెడుతూ చౌకబారు రాజకీయాలకు ఒడిగడుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాముడు, శివుడిని వేరుచేస్తూ సనాతన ధర్మాన్ని కించపరిచేలా సీఎం చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను యావత్ సమాజం ఛీత్కరించుకుంటోందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్‌ హిందూ సమాజాన్ని అవహేళన చేసి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, ఇప్పుడు అధిష్ఠానం మెప్పు కోసం రేవంత్‌రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తూ భంగపడక తప్పదని హెచ్చరించారు.

ఓడిన ప్రతిసారీ ఈవీఎంలపై నెపం నెట్టడం కాంగ్రెస్‌కు అలవాటైందని విమర్శించిన కిషన్‌రెడ్డి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓట్ చోరీ’ జరిగిందని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. బోగస్ ఓట్ల ఏరివేత కోసమే అధికారులు సమగ్ర ప్రక్రియ చేపడుతుంటే కాంగ్రెస్‌ ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల ఎంపీ స్థానాలను 129 నుంచి 195కు పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గాల పునర్విభజనను దురుద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆరోపించారు. స్థానిక సింగరేణి బొగ్గు వినియోగానికి అనుగుణంగా యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ బాయిలర్లను ఎందుకు నిర్మించలేదో గత బీఆర్‌ఎస్‌ పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోబోదని, కేటీఆర్‌ పగటికలలు మానుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఖైరతాబాద్‌ ఉపఎన్నిక వస్తే బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, అక్టోబర్‌ 3, 4 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని, అక్టోబర్‌ 2 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ‘స్వచ్ఛతా సంకల్ప్‌’లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి?

State

By Shekar

30 Sept 2026

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి?

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటి?

Telangana Graduate MLC Elections: తెలంగాణలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కొత్త ఓటర్ల నమోదు సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమైంది. గతంలో ఓటరుగా నమోదైన వారైనా లేదా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారైనా తప్పనిసరిగా ఫారమ్-18 ద్వారా అప్లై చేయాలి.

తెలంగాణలోని రెండు ప్రధాన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కొత్త ఓటర్ల జాబితా సేకరణను ఎన్నికల కమిషన్ అధికారికంగా స్టార్ట్ చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ తో పాటు వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే గ్రాడ్యుయేట్లు వెంటనే తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.తెలంగాణ ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ (https://ceotelangana.nic.in) ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ఫారాన్ని సమర్పించవచ్చు.

ఓటరుగా నమోదుకు అర్హతలు ఏంటి?

• డిగ్రీ విద్యార్హత: భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదేనీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి.

• 3 ఏళ్ల గడువు: 2026 నవంబర్ 1ని కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించారు. అంటే, 2023 నవంబర్ 1 లేదా అంతకంటే ముందే డిగ్రీ పాస్ అయి ఉండాలి.

• స్థానిక నివాసం: దరఖాస్తు చేసే నియోజకవర్గ పరిధిలో సాధారణ నివాసిగా నివసిస్తూ ఉండాలి. అంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మీరు ఉదాహరణకు హైదరాబాద్ లేదా ఖమ్మం పరిధిలో నివాసం ఉండాలి.

• పౌరసత్వం: భారతీయ పౌరుడై ఉండాలి.

చివరి తేదీ: ఓటర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 6 వరకు గడువు ఇవ్వబడింది.

అల్యూమినియం హబ్‌గా తూర్పు భారతం..కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

National

By Shekar

28 Sept 2026

అల్యూమినియం హబ్‌గా తూర్పు భారతం..కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

ఒడిశా గనులు, బెంగాల్‌ వాణిజ్యంతో విస్తృత అవకాశాలు

కోల్‌కతా: తూర్పు భారత ప్రాంతాన్ని దేశ పారిశ్రామికాభివృద్ధికి కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన ‘అల్యూమినియం రోడ్‌షో’లో పారిశ్రామికవేత్తలు, వ్యాపార రంగ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒడిశాలోని ఖనిజ సంపదను, పశ్చిమబెంగాల్‌ పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ సామర్థ్యంతో అనుసంధానిస్తే ఈ ప్రాంతం ప్రపంచస్థాయి అల్యూమినియం తయారీ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రక్షణ, రైల్వే, పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ రంగాల్లో అల్యూమినియం ప్రాధాన్యం పెరుగుతోందని, 'నెట్‌ జీరో 2070' సాధనలోనూ దీని పాత్ర కీలకమన్నారు. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా అధిక విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. 'అల్యూమినియం విజన్‌ 2047' ద్వారా దేశీయ ఉత్పత్తిని దాదాపు ఆరు రెట్లు పెంచడంతో పాటు, ప్రపంచ మార్కెట్లో భారత వాటాను 3.8 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

దేశంలో బొగ్గు కొరత లేదు

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో బొగ్గు కొరత లేదని స్పష్టం చేశారు. వర్షాకాలం ప్రభావం తగ్గుముఖం పట్టడంతో గనుల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకుందని, విద్యుత్ కేంద్రాలు సహా పరిశ్రమలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.

సీఈసీ రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌

State

By Shekar

28 Sept 2026

సీఈసీ రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌

మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

హాజరైన మంత్రులు, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ నేతృత్వంలో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన ఎన్నికల సంఘం కార్యాలయం వరకు కొనసాగింది. కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిని నిరసిస్తూ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు మాజీ ఎంపీ మహమ్మద్‌ అజారుద్దీన్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్న సీఈసీ తన పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని మండిపడ్డారు. ఈ నిరసనకు కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. భద్రతా దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు.

డా. సుప్రియా రత్న కుమార్‌కు అంతర్జాతీయ గుర్తింపు

National

By Shekar

28 Sept 2026

డా. సుప్రియా రత్న కుమార్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ఐపీసీ లెఫ్టినెంట్‌ జనరల్‌గా తొలి భారతీయ మహిళ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత మహిళా శక్తి మరోసారి సత్తా చాటింది. ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ పోలీస్ కమిషన్ – గ్లోబల్ కమాండ్ ఇంటర్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (IPC GC IGO) ఆమెను ‘సౌత్ ఏషియా కమాండర్’గా నియమించింది. సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పీస్‌కీపింగ్ ఆపరేషన్స్ పరిధిలో పారామిలిటరీ హోదా కలిగిన 'లెఫ్టినెంట్ జనరల్' బాధ్యతలను ఆమెకు అప్పగించింది. ఈ హోదాను దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు.

ప్రపంచ శాంతి, అంతర్జాతీయ చట్టాల అమలు, ప్రజా భద్రత, మానవతా దృక్పథంతో కూడిన సామాజిక సేవల విస్తరణే లక్ష్యంగా ఐపీసీ జీసీ ఐజీవో పనిచేస్తోంది. సంస్థ సుప్రీమ్ కమాండింగ్ జనరల్ రాబర్ట్ ఎస్. బియాజోన్ నేతృత్వంలోని గ్లోబల్ సుప్రీమ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డా. సుప్రియా నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి స్థాపన, విపత్తు సహాయక చర్యలు, సామాజిక సాధికారత తదితర కార్యక్రమాలకు ఆమె నాయకత్వం వహించనున్నారు.

ఫిలిప్పీన్స్‌లో ఉన్నత స్థాయి భేటీలు

ఈ నియామకం అనంతరం సెప్టెంబరు 19 నుంచి 25 వరకు డాక్టర్ సుప్రియా ఫిలిప్పీన్స్‌లో అధికారిక పర్యటన చేపట్టారు. అక్కడ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుల్లో సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గ్లైజా జేడ్ సి. పెనెడా, గ్లోబల్ ప్రొటెక్షన్ విభాగ డైరెక్టర్ బ్రయాన్ అల్ఫోన్సోతో పాటు ఫిలిప్పీన్ కమాండ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అలాగే దక్షిణ కొరియా, బంగ్లాదేశ్, అమెరికా తదితర దేశాల ఐపీసీ కమాండర్లతో ప్రత్యేకంగా భేటీ అయి, దక్షిణాసియాలో చేపట్టాల్సిన మానవతా సేవా ప్రాజెక్టులు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు. అంతర్జాతీయ సంస్థాగత నాయకత్వంలో భారతీయ మహిళకు ఇంతటి కీలక బాధ్యతలు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Entertainment

By Shekar

27 Sept 2026

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

ద‌స‌రా బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత హీరో నాని, డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్‌లో రూపొందిన మూవీ ది ప్యార‌డైజ్‌. నాని…మాస్ క‌థ‌తో సినిమా చేయ‌డంతో ఆరంభం నుంచే ప్యార‌డైజ్ తెలుగు ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తూ వ‌చ్చింది. క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన, మోహ‌న్‌బాబు విల‌న్‌గా క‌నిపించారు. సోనాలి కుల‌క‌ర్ణి ఓ కీల‌క పాత్ర పోషించారు.

క‌థ‌: ప్యార‌డైజ్‌లో బ‌తికే స‌వారీ జాతి వాళ్లంతా శిఖంజా మాలిక్ (మోహ‌న్‌బాబు) కింద బానిస‌లుగా బ‌తుకుంటారు. త‌న‌కు ఎదురుతిరిగిన వారిని దారుణంగా చంపేస్తుంటాడు శిఖంజా మాలిక్‌.  సంచారీ తెగ నుంచి తమకి గుర్తింపు కావాలని తొలిసారి గళం విప్పిన 'సమ్మక్క' (సోనాలీ కులకర్ణి) కొడుకే 'జడల్' (నాని).కొన్ని కారణాల 14 ఏళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన జడల్, జైలు నుంచి విడుదలవుతాడు. షికంజా మాలిక్ అంతు చూడాలనే ఉద్దేశంతో 'ప్యారడైజ్'లో అడుగుపెడతాడు. 

న‌టీన‌టుల ప‌నితీరు:జ‌డ‌ల్ పాత్ర కోసం నాని ప‌డిన క‌ష్టం ప్ర‌తి ఫ్రేమ్‌లో క‌నిపిస్తుంది. అత‌డి లుక్‌తో పాటు అటిట్యూడ్‌, డైలాగ్ డెలివ‌రీ, మ్యాన‌రిజ‌మ్స్ డిఫ‌రెంట్‌గా ఉన్నాయి.తెరపై విలన్ గా మోహన్ బాబు కనిపించగానే ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. కానీ ఆ ఉత్సాహాన్ని ఎక్కువసేపు ఉండనీయలేదు.ఇక రాఘవ్ జుయల్  తన పాత్ర గురించి తానేం అనుకున్నాడో తెలియదు .. ప్రాధాన్యత లేని సంపూ పాత్రను చూస్తే మాత్రం పాపం అనిపిస్తుంది.  ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ కి కొదవే లేదు. కాళ్లు .. చేతులు .. తలలు తెగిపడుతూ ఉంటాయి. చేతి వ్రేళ్ల దగ్గర నుంచి తల వరకూ నరుకుతూ వెళ్లడమే.ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ.. సెకండాఫ్ డిజప్పయింట్ చేసింది అని ఎక్కువ శాతం ప్రేక్షకులు చెప్పారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధిస్తుంది.గ్రాస్ పరంగా ఇప్పటికి రూ.119.50 కోట్లు కలెక్ట్ చేసింది

Rating:3/5

ఈ ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు

National

By Shekar

27 Sept 2026

ఈ ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు

వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో కేంద్రం, ఆర్బీఐ కీలక నిర్ణయం

న్యూ ఢిల్లీ: వినియోగదారుల సౌలభ్యం దృష్ట్యా ఈ నెల 27, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్  అనుమతి మంజూరు చేసింది.బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక  సెప్టెంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీనికి ముందు సెప్టెంబరు 26, 27  వారాంతపు సెలవులు కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించే పరిస్థితి ఏర్పడింది. 

సుదీర్ఘ విరామం వల్ల ఖాతాదారులకు తీవ్ర ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.కేంద్రం సూచనల మేరకు సెప్టెంబరు 27న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఏటీఎం అనుసంధాన విభాగాలు, కరెన్సీ చెస్ట్‌లు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. 

ఖాతాదారుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని తెలిపిన కేంద్రం.. ప్రతిపాదిత సమ్మెను విరమించుకోవాలని బ్యాంకు యూనియన్లకు విజ్ఞప్తి చేసింది. అత్యవసర బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది.

పారదర్శక పాలనకు పట్టం.. ఏపీ సోషల్ ఆడిట్‌కు ‘స్కోచ్ గోల్డ్’

National

By Shekar

26 Sept 2026

పారదర్శక పాలనకు పట్టం.. ఏపీ సోషల్ ఆడిట్‌కు ‘స్కోచ్ గోల్డ్’

దేశంలోనే తొలిసారిగా పురస్కారం దక్కించుకున్న రాష్ట్ర సంస్థ

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 26 (న్యూస్ డెక్): గ్రామాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ‘సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ’ (SSAAT) సంస్థ జాతీయ స్థాయి ‘స్కోచ్ గోల్డ్’ (SKOCH Gold) పురస్కారాన్ని దక్కించుకుంది. దేశంలో ఒక రాష్ట్ర సోషల్ ఆడిట్ విభాగానికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. దిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో జరిగిన 109వ ‘స్కోచ్’ సదస్సులో ఏపీ సోషల్ ఆడిట్ డైరెక్టర్ జి.శ్రీకాంత్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశంలో సామాజిక తనిఖీ వ్యవస్థను ప్రభుత్వం పటిష్ఠపరిచింది. గ్రామసభలు, ప్రజావేదికల ప్రత్యక్ష ప్రసారాలు, నివేదికల డిజిటలైజేషన్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచింది. ఏటా దాదాపు 13,396 తనిఖీలను నిర్వహిస్తూ, 2024-25లో 8.9 లక్షలు, 2025-26లో 9.18 లక్షల పనులపై ఆడిట్ పూర్తి చేశారు. అంతేకాకుండా 43.4 లక్షల ఉపాధి హామీ శ్రామిక కుటుంబాలను నేరుగా కలిసి అభిప్రాయాలు, సమస్యలను సేకరించారు. 

రాష్ట్రంలో అమలవుతున్న ఈ వినూత్న విధానాలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే 22 రాష్ట్రాల ప్రతినిధులు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషి, ప్రజల భాగస్వామ్యం వల్లే ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైందని డైరెక్టర్ జి.శ్రీకాంత్ పేర్కొన్నారు.

బాంబే‌లో సమాఖ్య గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ పోస్టర్ ఆవిష్కరణ

National

By Shekar

26 Sept 2026

బాంబే‌లో సమాఖ్య గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ పోస్టర్ ఆవిష్కరణ

అక్టోబరు 13 నుంచి 15 వరకు హైదరాబాద్ లో సదస్సు

బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ హాజరు 

ముంబయి(న్యూస్ డెక్): పారిశ్రామిక రంగంలో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్టోబరు 13 నుంచి 15 వరకు హైదరాబాద్‌ వేదికగా ‘సమాఖ్య 2026 గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌’ను నిర్వహించనున్నట్లు ‘సమాఖ్య చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ ప్రకటించింది. బృహస్పతి గ్రూప్‌ ఆధ్వర్యంలో ముంబయిలోని ఔరికా హోటల్‌లో నిర్వహించిన సన్నాహక సదస్సులో ఈ సదస్సు అధికారిక పోస్టర్‌ను ప్రముఖులు ఆవిష్కరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. సంప్రదాయ వ్యాపారాలతో పాటు కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి భవిష్యత్‌ సాంకేతికతల్లో యువత రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. స్టార్టప్‌ ఇండియా, ముద్ర రుణాల వంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తోందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌రావ్‌ నాయక్‌ మాట్లాడుతూ.. దేశ పారిశ్రామిక ప్రగతిలో భాగస్వామ్యం ఎంతో కీలకమని, తమ రాష్ట్ర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ వర్గాల సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మహాసదస్సుకు సన్నాహకంగా దిల్లీ, బెంగళూరు, చెన్నైలలోనూ ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.