ఖమ్మం: విఘ్ననాథుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని ఎంపీ కోరారు. ప్రకృతికి హాని కలగకుండా, భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలను పర్యావరణహితంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
