Category

Latest News

తెలంగాణ పట్టభద్రుల MLC పోరులో జనసేన

Latest News

By Shekar

17 Oct 2026

తెలంగాణ పట్టభద్రుల MLC పోరులో జనసేన

జనసేన పార్టీ రాబోయే ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు పేరు ఖరారు చేసింది.తెలంగాణలో జనసేన పార్టీ నేరుగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవడం ఆసక్తిని పెంచుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని యువత,పట్టభద్రులకు పవన్ కళ్యాన్ విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలోనే ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ ప్రచార రథాన్ని ప్రారంభించారు.ఈ వాహనం 120 రోజుల పాటు ప్రజల్లో తిరుగుతూ పట్టభద్రుల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకునే వేదికగా పనిచేయాలని పవన్ కళ్యాన్ సూచించారు.

ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావుకు మద్దతుగా రూపొందించిన ‘ జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ’ ప్రచార రథాన్ని పవన్ కళ్యాణ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు.జనసేన పార్టీ తెలంగాణలోనే స్థాపించబడిందని గుర్తుచేస్తూ ఇక్కడి ప్రజలతో పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు.

"గ్లాసు" పార్టీ లో చేరిన వంగవీటి రాధ.విజయవాడ మేయర్‌ రేసులో రాధా?

Latest News

By Shekar

14 Oct 2026

"గ్లాసు" పార్టీ లో చేరిన వంగవీటి రాధ.విజయవాడ మేయర్‌ రేసులో రాధా?

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. విజయవాడ రాజకీయాల్లో బలమైన నేపథ్యం ఉన్న రాధా చేరిక అందరి దృష్టిని ఆకర్షించింది. విజయవాడ మేయర్ పదవికి జనసేన ఆయనను పరిశీలించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, మేయర్ అభ్యర్థుల విషయంలో ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పరిణామాలు కూటమి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అదే సమయంలో, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు మరియు ఇతర కూటమి నాయకులు సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి:అనంత్‌ అంబానీ

Latest News

By Shekar

03 Oct 2026

నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి:అనంత్‌ అంబానీ

అన్నమయ్య జిల్లా: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు."నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి",రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి’ అని సీఎం చంద్రబాబును రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కోరారు.

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ పాల్గొన్నారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ శంకుస్థాపన కార్యక్రమంలో తన ప్రసంగంతో అనంత్  అంబానీ ఆకట్టుకున్నారు. ప్రసంగం అనంతరం అనంత్ అంబానీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయనను అప్యాయంగా సీఎం చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు.

సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు నమోదు

Latest News

By Shekar

23 Sept 2026

సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు నమోదు

పసికందుల సజీవ దహనంపై అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  

న్యూ ఢిల్లీ: తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులు, పాలకుల వ్యవస్థాగత నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రస్థాయిలో స్పందించింది. వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా నిరుపేద రోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి అధికారికంగా కేసు నమోదు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో పసికందుల మరణాలు, కుప్పకూలుతున్న భవనాలు, కనీస సౌకర్యాల లేమిపై హైకోర్టు న్యాయవాది వినోద్ హిందుస్థానీ సమగ్ర ఆధారాలతో సమర్పించిన ఫిర్యాదుపై కమిషన్ ఈ చర్య తీసుకుంది.

ఆదిలాబాద్ రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (SNCU)లో ఏసీల నిర్వహణ లోపం, షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు పసికందులు సజీవ దహనమైన ఘటన ప్రభుత్వ క్రిమినల్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని పిటిషన్‌లో పేర్కొన్నారు. 750 పడకల ఆసుపత్రికి కేవలం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు మాత్రమే ఉండటం వ్యవస్థాగత వైఫల్యాన్ని స్పష్టం చేస్తోందని ప్రస్తావించారు. అటు వరంగల్ ఎంజీఎంలోనూ తగినన్ని రేడియంట్ వార్మర్లు, ఇంక్యుబేటర్లు లేక ఒకే వార్మర్‌లో ఇద్దరు ముగ్గురు శిశువులకు చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొంది. వార్డుల్లో పెచ్చులూడి రోగుల నెత్తిన పడుతున్నా మరమ్మతులు చేపట్టకపోవడం, ఐసీయూల్లోకి సైతం ఎలుకలు చేరి రోగులను కొరకడం, ఆవరణలో కుక్కల సంచారం రోగుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. పడకలు చాలక గర్భిణులు, వృద్ధులు నేలపైనే పడుకుని చికిత్స పొందుతున్న అమానవీయ పరిస్థితులు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు (ఆర్టికల్ 21) ఉల్లంఘన కిందకే వస్తాయని వివరించారు.

ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ (కేసు డైరీ 112620/CR/2026) కేసును నమోదు చేసింది. ఈ ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి త్వరలోనే నోటీసులు జారీ చేసి సమగ్ర విచారణ నివేదిక కోరనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రుల్లో వెంటనే థర్డ్ పార్టీ ఎలక్ట్రికల్, ఫైర్ మరియు స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహించాలని, మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించి దోషులపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కమిషన్‌ను పిటిషనర్ కోరారు.

గణనాథుడి అశీస్సులతో ఆనందం వెల్లివిరియాలి: ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

Latest News

By Shekar

13 Sept 2026

గణనాథుడి అశీస్సులతో ఆనందం వెల్లివిరియాలి: ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

ఖమ్మం: విఘ్ననాథుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని ఎంపీ కోరారు. ప్రకృతికి హాని కలగకుండా, భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలను పర్యావరణహితంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.