విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన మూవీ 'రణబాలి'. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.'గీత గోవిందం','డియర్ కామ్రేడ్`' చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తోన్న మూవీ.పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం. పీరియాడికల్ హిస్టరీ యాక్షన్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు.1870-80 ప్రాంతంలో ఓ వైపు కరువు వెంటాడుతుంటుంది.మరోవైపు బ్రిటీష్ వాళ్లు ధాన్యాన్ని దోచుకొని పోతుంటారు.ప్రజలు ఆకలితో అలమటిస్తున్న రోజులవి.బ్రిటీష్ వాళ్లు వచ్చి అక్కడి ధాన్యాన్ని కొల్లగొడతారు.వారికి అండగా నిలుస్తాడు రణబాలి.చాలా ఊర్ల ప్రజలకు ఆకలి తీరుస్తాడు. ఈ క్రమంలో బ్రిటీష్ వారితో పోరాడతాడు.

ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా విజయ్, రష్మిక ట్రాక్ ఉండటం ప్లస్ పాయింట్స్.బీజీఎం సినిమాని ఎలివేట్ చేస్తుంది.సెకండాఫ్ విషయానికి వస్తే చాలా వరకు సాగదీసినట్టుగా అనిపిస్తుంది.రాహుల్ సంకృత్యాన్ విజన్‌కి తగ్గట్టుగా అన్ని టీంలు అద్భుతంగా పని చేశాయి.ఈ సినిమాకి టెక్నికల్ టీం అతి పెద్ద బలం. డైలాగ్స్ మరీ అంత గొప్పగా అనిపించవు. ఏందయ్య సామీ పాట అయితే ట్రీట్‌లా ఉంటుంది.
నటీనటుల విషయానికి వస్తే విజయ్ తన గత సినిమాలతో పోలిస్తే అద్భుతంగా చేసేశాడు. రణబాలి పాత్ర కోసం మారిన తీరు, మాటలు పలికించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. ఇక జయమ్మగా రష్మిక తన పాత్రకు న్యాయం చేస్తుంది. అసలు ఈ ఇద్దరినీ తెరపై చూస్తుంటే నిజంగానే ముచ్చటేస్తుంది. బిట్రీష్ ఆఫీసర్లుగా నటించిన వారు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ బాగానే నటించారు.పిరియాడిక్ నేపథ్యంగా సాగే ఈ సినిమాను దర్శకుడు రాహుల్ నిజాయితీగా కథను చెప్పారు. అలాగే పాత్రలను నమ్మి విజయ్ దేవరకొండ, రష్మిక అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాటోగ్రఫి తదితర అంశాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.
రేటింగ్ : 3/5




