దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన మూవీ ది ప్యారడైజ్. నాని…మాస్ కథతో సినిమా చేయడంతో ఆరంభం నుంచే ప్యారడైజ్ తెలుగు ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చింది. కయదు లోహర్ హీరోయిన్‌గా నటించిన, మోహన్‌బాబు విలన్‌గా కనిపించారు. సోనాలి కులకర్ణి ఓ కీలక పాత్ర పోషించారు.
కథ: ప్యారడైజ్‌లో బతికే సవారీ జాతి వాళ్లంతా శిఖంజా మాలిక్ (మోహన్‌బాబు) కింద బానిసలుగా బతుకుంటారు. తనకు ఎదురుతిరిగిన వారిని దారుణంగా చంపేస్తుంటాడు శిఖంజా మాలిక్. సంచారీ తెగ నుంచి తమకి గుర్తింపు కావాలని తొలిసారి గళం విప్పిన 'సమ్మక్క' (సోనాలీ కులకర్ణి) కొడుకే 'జడల్' (నాని).కొన్ని కారణాల 14 ఏళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన జడల్, జైలు నుంచి విడుదలవుతాడు. షికంజా మాలిక్ అంతు చూడాలనే ఉద్దేశంతో 'ప్యారడైజ్'లో అడుగుపెడతాడు.
నటీనటుల పనితీరు:జడల్ పాత్ర కోసం నాని పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. అతడి లుక్‌తో పాటు అటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి.తెరపై విలన్ గా మోహన్ బాబు కనిపించగానే ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. కానీ ఆ ఉత్సాహాన్ని ఎక్కువసేపు ఉండనీయలేదు.ఇక రాఘవ్ జుయల్ తన పాత్ర గురించి తానేం అనుకున్నాడో తెలియదు .. ప్రాధాన్యత లేని సంపూ పాత్రను చూస్తే మాత్రం పాపం అనిపిస్తుంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ కి కొదవే లేదు. కాళ్లు .. చేతులు .. తలలు తెగిపడుతూ ఉంటాయి. చేతి వ్రేళ్ల దగ్గర నుంచి తల వరకూ నరుకుతూ వెళ్లడమే.ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ.. సెకండాఫ్ డిజప్పయింట్ చేసింది అని ఎక్కువ శాతం ప్రేక్షకులు చెప్పారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధిస్తుంది.గ్రాస్ పరంగా ఇప్పటికి రూ.119.50 కోట్లు కలెక్ట్ చేసింది
Rating:3/5






