మరోసారి తనకు అచ్చొచ్చిన ఎంటర్టైన్మెంట్ ఫార్ములాలోనే శ్రీవిష్ణు చేసిన లేటెస్ట్ మూవీ “కామ్రేడ్ కళ్యాణ్”.నక్సలిజం ఉద్యమానికి వినోదాన్ని జోడించి తెరకెక్కించిన ఈ సినిమాకు జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు.మహిమా నంబియార్ హీరోయిన్గా సత్య,సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు.రైటర్ కోన వెంకట్ ప్రజెంటర్‌గా, సీతా కర్నాటి,వెంకట కృష్ణ కర్నాటి నిర్మాతలుగా వ్యవహరించారు.ఫస్ట్ హాఫ్ మొత్తానికి నిరాశపరుస్తుంది,సత్య కామెడీ తప్పా.సెకండ్ హాఫ్ లో మాత్రం శ్రీవిష్ణు,సత్య చేసే కామెడీ ఆకట్టుకుంటుంది.
సీనియర్ హీరోయిన్ రాధిక నటనానుభవాన్ని దర్శకుడు సరిగ్గా వాడుకోలేదు.ప్రాంతంలోనే కల్యాణ్ (శ్రీ విష్ణు) సినిమా థియేటర్లో ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు.ఒడిశా అమ్మాయి సితారను తొలిచూపులోనే కల్యాణ్ ప్రేమలో పడుతాడు.సితారాను పెళ్లి చేసుకొంటానని బ్లాక్ మెయిల్ చేస్తూ బిష్వాస్ (ఉపేంద్ర లిమాయే) అనే వడ్డీ వ్యాపారి వెంటాపడుతుంటాడు.అయితే సితార పరిస్థితి చూసి కల్యాణ్ అండగా నిలుస్తాడు.సత్తిబాబు (సత్య) టీమ్ చేసే స్కీం కారణంగా అడవిలో అన్నగా కల్యాణ్ కామ్రేడ్ అవుతాడు.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీవిష్ణుకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే.కొత్తగా చేయాల్సిన అవసరమే కలుగలేదు.తన బాడీ లాంగ్వేజ్,హావభావాలు,తన మార్క్ డైలాగ్ డెలివరీతో సింపుల్‌గా పని కానిచ్చేశాడు.కమెడియన్ సత్య మరోసారి తన మార్కు కామెడీతో ఆకట్టుకొన్నాడు.ఫస్ట్ హాఫ్ మొత్తానికి నిరాశపరుస్తుంది,సత్య కామెడీ తప్పా.సెకండ్ హాఫ్ లో మాత్రం శ్రీవిష్ణు,సత్య చేసే కామెడీ ఆకట్టుకుంటుంది.విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ పరంగా ఒకే.తన మార్క్ పాటలు మిస్ అయ్యాయనే చెప్పాలి.కామ్రేడ్ కళ్యాణ్‌కు టైమ్‌పాస్ ఎంటర్టైనర్.శ్రీవిష్ణు,సత్య కామెడీ కోసం చూడొచ్చు.
రేటింగ్: 2/5.




