అన్నమయ్య జిల్లా: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు."నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి",రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి’ అని సీఎం చంద్రబాబును రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కోరారు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ పాల్గొన్నారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ శంకుస్థాపన కార్యక్రమంలో తన ప్రసంగంతో అనంత్ అంబానీ ఆకట్టుకున్నారు. ప్రసంగం అనంతరం అనంత్ అంబానీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయనను అప్యాయంగా సీఎం చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు.



