పల్లెల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

State

పల్లెల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

By Shekar2 hr

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు ఈ కార్డుల పంపిణీ పూర్తయింది.దాదాపు 90 శాతం లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా ఈ ఫిజికల్ కార్డులను అందించారు.1.05 కోట్లకు పైగా అర్హులైన కుటుంబాలకు సంబంధించి, సంప్రదాయ కాగితపు కార్డుల స్థానంలో QR-సదుపాయం కలిగిన, క్రెడిట్-కార్డ్ పరిమాణంలో ఉండే కొత్త PVC స్మార్ట్ రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తోంది.దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లా ,ఆత్మకూర్ (ఎస్) మండలం,ఇస్థలాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మధు(VRO),(GPO), ఇరుగూ ప్రవీళ కృష్ణకుమార్(గ్రామ సర్పంచ్),తూడి రాములు(వార్డు సభ్యుడు),మర్రు అబ్బయ్య,కప్పల చంద్రశేఖర్...తదితరులు పాల్గొన్నారు.