మొదటిసారి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చేయటం యెంతో సంతోషంగా ఉంది : యువ యూత్ సభ్యులు(ఇస్తలాపురం)

State

మొదటిసారి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చేయటం యెంతో సంతోషంగా ఉంది : యువ యూత్ సభ్యులు(ఇస్తలాపురం)

By Shekar2 hr

2026 శారదీయ దేవీ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి.స్థానిక యువజన సంఘాలు మరియు యువసేనలు విస్తృతమైన నిర్వహణ ఏర్పాట్లు చేయడంలోనూ, భారీ పండళ్లను ఏర్పాటు చేయడంలోనూ చురుకుగా పాల్గొంటున్నాయి.వారి సన్నాహాల్లో ఒక ముఖ్యమైన భాగం,తమ ప్రాంతంలోని మండపాల కోసం అమ్మవారి (దుర్గాదేవి) అత్యుత్తమ విగ్రహాన్ని ఎంపిక చేసి కొనుగోలు చేయడం.అమ్మవారి విగ్రహం కొనుగోలులో భాగంగా హైదరాబాద్‌లోని నాగోలులో కొందరు యువకులు తారసపడ్డారు.

తెలుగు పంచాంగం ప్రకారం, ఆశ్వయుజ శుక్ల పాడ్యమి తిథి అక్టోబర్ 11న సూర్యోదయంతో ప్రారంభం అవుతుండటంతో అదే రోజున ఘటస్థాపన (కలశ స్థాపన) నిర్వహించనున్నారు. అక్టోబర్ 20న విజయదశమి (దసరా) వేడుకలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.దేవీ నవరాత్రులు (శరన్నవరాత్రులు) ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు అంగరంగ వైభవంగా జరుపుకునే విశిష్టమైన శక్తి ఆరాధన పండుగ. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో జగన్మాతను వివిధ రూపాల్లో భక్తులు కొలుస్తారు.