దిల్‌సుఖ్‌నగర్‌ ఆలయంలో దారుణం.అమ్మవారి విగ్రహంపై కర్రతో దాడి

State

దిల్‌సుఖ్‌నగర్‌ ఆలయంలో దారుణం.అమ్మవారి విగ్రహంపై కర్రతో దాడి

By Shekar51 min

దిల్‌సుఖ్‌నగర్‌ సంతోషిమాత ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి అమ్మవారి విగ్రహంపై కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనను గమనించిన భక్తులు వెంటనే అతడిని అడ్డుకుని పట్టుకున్నారు. అనంతరం చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.శుక్రవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించగా.అతడి చేతిలో ఉన్న కర్రతో పూజారిపై దాడికి ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.