జనసేన పార్టీ రాబోయే ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు పేరు ఖరారు చేసింది.తెలంగాణలో జనసేన పార్టీ నేరుగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవడం ఆసక్తిని పెంచుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని యువత,పట్టభద్రులకు పవన్ కళ్యాన్ విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలోనే ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ ప్రచార రథాన్ని ప్రారంభించారు.ఈ వాహనం 120 రోజుల పాటు ప్రజల్లో తిరుగుతూ పట్టభద్రుల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకునే వేదికగా పనిచేయాలని పవన్ కళ్యాన్ సూచించారు.

ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావుకు మద్దతుగా రూపొందించిన ‘ జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ ’ ప్రచార రథాన్ని పవన్ కళ్యాణ్ శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభించారు.జనసేన పార్టీ తెలంగాణలోనే స్థాపించబడిందని గుర్తుచేస్తూ ఇక్కడి ప్రజలతో పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు.





