Flydubai Flight : ఫ్లైదుబాయ్ విమానం ఘ‌ట‌న‌

International

Flydubai Flight : ఫ్లైదుబాయ్ విమానం ఘ‌ట‌న‌

By Shekar2 hr

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) వెళ్లాల్సిన ఫ్లైదుబాయ్ సంస్థ‌కు చెందిన విమానం సౌదీ అరేబియాలోని ట‌బుకులో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయిన సంగ‌తి తెలిసిందే.అయితే, ఈలోపు విమానం హైజాక్ అయిన‌ట్లు కంట్రోల్ రూంకు కోడ్ అల‌ర్ట్ వెళ్లింది. దీంతో నిజంగానే ఫ్లైట్ హైజాక్ అయ్యిందేమో అన్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఈ విష‌యంలో ప్ర‌స్తుతం కొన్ని ప్రాథ‌మిక అంశాలు వెల్ల‌డయ్యాయి.

ఈ ఘటనలో ఉగ్రవాద కోణం ఉండొచ్చని ఇజ్రాయెల్ అధికారులు తమ అంచనాను మార్చుకున్నారు. ఇద్దరు పైలట్ల మధ్య ‘తీవ్ర ఘర్షణ’ జరిగిన తర్వాత విమానాన్ని దారి మళ్లించినట్లు తెలిపారు. సుమారు 180 మంది ప్రయాణికులతో ఉన్న విమానంలో కో-పైలట్, పైలట్‌ను కత్తితో పొడిచాడు. అనంతరం విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు. అనంతరం రెండవ పైలట్ల బృందం, బుధవారం సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసింది.

ప్రయాణికులు సురక్షితం

పైలట్ల మధ్య ఘర్షణతో విమానం ఒక్కసారిగా 17,400 అడుగుల మేర కిందికి దిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం దానిని దారి మళ్లించి సౌదీలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పైలట్, కో-పైలట్ ఇద్దరూ గాయపడి ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పరిస్థితి “అదుపులో ఉంది” అని పేర్కొంది. పైలట్ తీవ్ర గాయాలతో ఉన్న విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారని ప్రయాణికులు పేర్కొన్నారు.